పుట:Bhaarata arthashaastramu (1958).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

మూల్యము - ప్రయోజనము

శ్రమయెట్లో యట్లే ఖరీదు నిచ్చుటయు గష్టమైనపని. ఈ కష్టమున కన్న వస్తులాభమువలన గలుగు సుఖ మెక్కువయని తోచినంగాని యెవడును దానింగొనడు. వినిమయ కార్యంబులయందెల్ల నిచ్చు వస్తువుయొక్క యంత్యప్రయోజనమునకన్న గొనువస్తువుయొక్క యంత్యప్రయోజన మొకింతయైన నెక్కువగ నుండునను న్యాయము నిత్యము, ఇట్లు కష్టము వ్యవకలితముకాగా మిగిలిన సుఖమునకు "వినియోజకులకు అబ్బు శేష" మని పేరు.

వినియోజకశేషము

దీనిని గొలతవెట్టుట యెట్లనగా. ఒకవస్తువును బొందక పోవుటకన్న నేమాత్రము నిచ్చియైన గొనితీరవలయునని తలంపు గొందుమో యామాత్రము ధరలోనుండి సాక్షాత్తుగా నిచ్చినధరను ద్రోపుడు సేయుటచేత. ఉదా. ఉప్పు. ఇది యపూర్వమైనచో వరహాలనైననిచ్చి కొందుము. సర్వసాధారణముగ బండునది గావున గొన్నిపైసలైన నిచ్చుటయేలయని యలజడి వహింతుము. కావున లవణసంపాదనమున శేషసుఖ మత్యంతమనుట సువ్యక్తము.

ఆవరణ మహాత్మ్యము

యీ సుఖమును మనము స్వయముగ నార్జించితిమా? యోచించి చూచిన కాదనుట నిర్వివాదాంశము. ఖరీదు మన మిత్తుమనుట నిజమేయైనను ఖరీదంత తక్కువపడుటకు గొనువారలా కారణము? కాదు. ఐన మఱియెవరు? ఉప్పుపంట బెట్టువారందమా? కొంతవఱకు వీరు కారణభూతులనుట నిజమే. ఐన నాపంట-----