పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

(8) ద్రౌపది - పాతివ్రత్యమాహాత్మ్యము. బును బ్రయోగించి శిశుపాలుని మస్తకంబును దటాలున ఖండించెను. కం. భూరిగుణోన్నతు లనఁదగు హరికి ధీరులకు ధరణివల్లభులకు ఈ క్పారుష్యము చను నే మహా దారుణమది విషముకంటె దహనముకంటెన్.

18. ద్రౌపది - పాతివ్రత్యమాహాత్మ్యము.


ఖాండవ దహన కాలమున నగునుఁడు మయునకుఁ గావించిన మహోపళారమును దలంచి, మయుఁడు రాజు సూయ సందర్భమున నత్యద్భుత మగునొకసభగావించి పాండ పులకి చ్చెను. ఆ విచిత్ర సభావై భవంబును జూచివచ్చిన రాజు లెల్లకు మితిమీరిన యాశ్చర్యమును జూచుటయం దింకను ద: విఁ - దక, దుర్యోధనుఁడు శకు నీతోఁ గొన్ని దిసములం దే యండి పోయెను. ఒకనాడు దాని యపూర్వరమణీయతకు విస్మితుండై యా యూప్రదేశములం గ్రుమగుచు, వివృతంబైన ద్వారమును సంవృతంబుగాఁ దలంచి చొరనొల్లక, సంవృత ద్వారమును వివృతంబని చొరంబోయి, కవాటఘటిత లలాటుండగుచుండెను. మఱియు విమలమణిష్ఠలంబు జలా శయంబనుకొని పరిధానంబుగఁ దోచికొని, నిజమైన జలాశయంబును స్థలముగాఁ దలంచి, కట్టిన పుట్టము తడియం