పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కుజుడు - దైవదూషణను, యందలి రాజులను శాసించిరి. సయముచేఁ గొందఱు, భయముచేఁ గొందఱును, బోరాడి యోడిపోయి కొందఱును, మొత్తము పై రాజు లెల్లకును బాండుకుమారులకు వశులై యపరిమితము లైన ధనకనక వస్తు వాహనాదులను యుధిష్ఠిరు నకు సమర్పించుకొనిరి. ధర్మరాజు రాజసూయ యాగమును బ్రారంభించెను, పురోహితుఁ డై న చౌమ్యుఁడు కావలసిన యజ్ఞోపకరణ ద్రవ్యము లన్నియు సమకూర్చెను • దిగ్విజయమున ధర రాజు నడు సామంత రాజు లైన మహా రాజులందు నా యాగమున రాహ్వానింపఁబడి వచ్చిరి. వచ్చిన రాజుల కెల్లఁ దగిన నివేశము లొసుగఁబడినవి. దుర్యోధనుఁడు కర్ణునితోడను సూర్వురు తములతోడను వచ్చెను. మఱియు విరాట ద్రుపద శిశుపాల వృష్టి భోజూంధక రాజులును, అంగ మగ కళింగ కాశీర కాంభోజాది రాజులును వచ్చిరి. అట్లు వచ్చిన సకల రాజులోక ములో మనకుఁ బ్రస్తుతము శిశుపాలుఁడు ముఖ్యుఁడు. శిశుపాలుఁడు చేది రాజ్యముసకు రాజు. తండ్రి దమ ఘోషుఁడు. తల్లి సాత్వతి. ఆ దంపతులకు వీడు చతుర్భుజ లలాట నేత్రములతోఁ బుట్టి, పుట్టినంత నే గార్దభస్వరంబుతో నేడువ నారంభించెను. ఆ యేడుపు చూచి తల్లిదండ్రులు భయవి స్తయాధీన మనస్కులగుచుండ నొక్క యశరీరి యైన భూతము వారి కిట్లనియె. “ఈ బాలు 'నెవ్వరెత్తికొనినచో వీని రెండు చేతులు లలాట నేత్రమును మాయమగునో