పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారత నీతి కధలు రెండవ భాగము


15. బృహద్రధుఁడు - పుత్రప్రాప్తి.


పాండవు లింద్రప్రసపురము పరిపాలించుచు సుఖం బున్న దినములలో నొకనాడు నారదుఁడు వారికడకు వచ్చి యిట్లనియె. “ధర్మనందనా నేను లోకపాలుర సభలెల్ల విలోకించుచు యమసభకుం బోయితిని. మీతండ్రి పాండు రాజు యమసభనుండి మీ కెఱింగించుటకై కొన్ని సంగతులు నాతోఁ జెప్పెను. పొనిపలుకులు వినుఁడు. “హరిశ్చంద్ర ప్రముఖులైన మహారాజులు రాజసూయమును జేసి దేవేంద్ర లోకమును బడయఁ గలిగిరి. నారదా! నేనీ యమలోకము నందుంటిని. నీవు సత్వరముగ భూలోకమున కేగి నా కుమారు లంగని, రాజసూయమును జేసి నాకు త్తమగతులు గలిగించు నట్లు బోధింపుము." ధర్మనందనా ! పరాఠమవంతులైన తములుగల నీకు దిగ్విజయము సుకరము. కావున నవళ్యముగ మీ తండ్రియాజ్ఞ నిర్వహించి దానిని బుణ్యలోకముల నొందింపుము.”

నారదుని పలంకులు వినినంత నీ యమసభ యందున్న తండ్రిందలంచి పాండవులు మిక్కిలిచింతించిరి. ధరరాజు పురో హీతుండైన ధౌమ్యునితో నాలోచింప నతడు తప్పక రాజసూ యమును గావింపవలసినదని వానిని ప్రోత్సహించెను. సోదరు లైన భీమసేనాదులును దిగ్విజయమునం దత్యుత్సాహులైరి, అప్పుడు ధర్మరాజు తనయా ప్తచరుల గొందఱిని రప్పించి