పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మందపాలుడు - సంతానాపేక్ష, అంత నన్న లువురు పుత్రులును నాలుగు వేదంబులం బోలె సగ్నిసూక్తంబులు పఠించుచు, సం స్తుతించుచు ““మహాత్మా ! నగ్ని భట్టారకా! మా కభయము ! అభయము! అభయము!" అని యరచిరి. అగ్ని దేవుండప్పుడు మందపాలుని ప్రార్థనము దలంచి, యన్న లువురున్న వృక్షంబు భక్షింపక పరిహరించె. గగనంబునుండి జరీత యదిచూచి యత్యానంద ముతోఁ గొదుకుల యొద్దకు వచ్చి, లపితతో విహరించు చుండిన మందపాలుండు కొడుకులం దలంచి, జరిత వారిని ర&ంపఁ గలిగెనో లేదో యనియు నగ్ని దేవుండు తన ప్రార్ధనమును మన్నించెనో లేదో యనియుఁ బలువిధములఁ జింతింప సాగెను. అనలుఁడు క్రూరుఁడు. వానిని నమఁదగదని యనుకొనుచువచ్చి సురక్షితులై యున్న కొడుకులను జరీతను గాంచి సంతసించి, సంతాన కారణంబున బుణ్యలోకంబులను బడయగలిగెను. క. ఎంతతపంబొనరించియు సంతానము లేనివారు సద్గతిఁబొందం గాంతురె! నీ తసమేటికి ? సం తానము వడయు మరలి సన్నునినాధా !