పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారతనీతికథలు

రెండవ భాగము.

1. అంగారపర్ణుఁడు - గర్వభంగము.

పాండవులు బ్రాహ్మణవేషములతో నేకచక్రపురమున జీవించుచు నొకనాఁడు ద్రౌపదీ స్వయంవర వార్తను వినిరి. ద్రౌపది పాంచాల దేశాధీశ్వరుండైన ద్రుపదునికూఁతురు. లోకమునఁ జాటింపఁబడిన యామెస్వయంవర వార్తవిని ప్రసిద్ధులైన రాజకుమారులెల్లరుఁ బాంచాల రాజధానియగు కాంపిల్యనగరమునకుఁ బ్రయాణమగుచుండిరి. స్వయంవరోత్సవమున బహువిధ దక్షిణలం బడయ గలమని వేదాధ్యయన సంపన్నులగు బ్రాహ్మణులుఁగూడ బాంచాలవురము చేరుకొనుచుండిరి. ఆ దినములలోఁ బట్టణయుల యందును బల్లెలయందును బ్రజలలో నిదియే ప్రసంగము.

ఈ వార్తలన్నియు వినుచుండుటచేత ద్రౌపదీ స్వయంవరమును దర్శింపవలయునని పాండవుల కుత్సాహము కలిగినది. తల్లియైన కుంతి కుమారుల యభీష్టమును గ్రహించి