పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

28

భారత నీతి కథలు - రెండవ భాగము.


అప్పుడు ధృష్టద్యుమ్నుండు రంగమధ్యమునకువచ్చి చేయెత్తి కలకలం బెల్ల వారించి, మూగిన రాజ లోకంబు నెల్లఁ జూచి, యగ్ని సమీపంబున గంధపుష్ప ధూపదీ సార్చి తంబై ని విల్లును నములును నైహాయనం బైన లక్ష్యంబును వారలకం జూపి యిట్లనియె. "ఈవిల్లుమో పెట్టి యైదు బాణంబుల నీమత్స్యయంతంబు నేయఁవాఁడి బ్బాలకుం దగినవరుండు. కావున మీనాకారు క కలాకౌశలంబులును బాహుబలతి శయంబులును జూపుటకియ్యది యవసరంబు” అట్లు పలికి ధృష్టద్యుమ్నుఁడు పాంచాలిం జూచివచ్చిన రాజవీరులనెల్ల నామ్ కెఱింగించుచుండెను.

ధృష్టద్యుమ్నుని పలుకులు వినినంత నే రాజపుత్రుల కెల్ల నూతనసంభ్రమోత్సాహములు జనించినవి. ఒక్కొక్కఁడువచ్చి విల్లుపట్టి తన భాగ్యమును బరీక్షించుకొని పోవుచుండెను. మహా భారంబగునా కారు, కంబును నెత్తఁజాలకయు, నెత్తివంపఁజాలక యు, వంచిలత్యుంబు సేయఁజూలకయు, రాజకుమారుల నేకులు లజ్జావనత వదనులగుచుండిరి. బలవంతులయ్యను గొందఱు రాజులు జగన్మోహినియైన పాంచాలింజూచుచు మతిహీను లును బలహీనులు నగుచుండిరి. ఇయ్యది మాయాధనువు. దీనిని మో పెట్టఁదల పెట్టరాదని కొందఱు బుద్ధిమంతులు తట స్థులే యూరకుండిరి. కృష్ణుని యనుమతంబున యదువృష్టి భోజంధక వీరులుమిన్నకుండిరి. శిశుపాల జరాసంధ శల్యకర్ల ప్రముఖులైన మహావీరు లెల్లరు గురితప్పి విఫల మనోరథు