పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

భారతనీతి కథలు - రెండవ భాగము.

మునకు విశ్వామిత్రుండెంతయు సంతసించి, యారాక్షసునకు బోధించి వసిష్ఠవుత్రుల నందఱంగూడ వానిచేఁ జంపించెను. ఇట్లొక్కమారుగ రాక్షసనిహతులైన కుమారకులంజూచి, పరమయోగ ధరుండయ్యుఁ బాపము వసిష్ఠుఁడు శతపుత్ర శోక దందహ్యమాన మానసుండయ్యెను. క్రమక్రమముగ నతఁడు దుఃఖాతిశయంబున వివశాత్ముండై యాత్మహత్య మహాపాపంబని తలంపనేరక, యావిషాదంబున దావానల మధ్యంబునఁ జొచ్చెను. కాని యాతఁడు చొచ్చినంతనే యమ్మహావలంబు వానికి శీతంబై వాని కెట్టి యపాయంబును గావింపదయ్యె.

అంత వసిష్ఠుండు కంఠ దేశంబున రాయిగట్టుకొని సముద్ర మధ్యమున నుఱికెను. తోడనే సముద్రస్వామి తన యుత్తుంగ తరంగహస్తంబుల నాతనింబట్టియెత్తి యతిభద్రంబుగఁ దీరంబునంజేర్చె. సుతశతవర్జితంబైన యాశ్రమంబికఁ జూడనొల్లనని వసిష్ఠుండింటికిఁ బోనొల్లక యచ్చటనుండి మేరుపర్వతంబునకుఁ బోయి యత్యున్నతంబైన తచ్చిఖరంబెక్కి యందుండి తటాలున నేలకుదుమికెను. అత్యధిక తపస్సంపన్నుడైన యమ్మహాత్ముని దేహబంధము లేశమైన గాయమువడదయ్యె. పీమ్మట నతడతి భయంకరముగఁ బ్రవహించుచుండిన యొక మహానదిం బ్రవేశించెను. అయ్యది శతవిధంబులఁ బరిద్రుతయై వసిష్ఠునకు స్థల మొసంగుటచే దానికి శతద్రునామము వచ్చినది.