పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్మాషపాదుఁడు - బ్రాహ్మణతిరస్కారము.

15

4. కల్మాషపాదుఁడు - బ్రాహ్మణతిరస్కారము.

వసిష్ఠుని యద్భుత ప్రభావమునకుఁ బాండవులు మహాశ్చర్య చేతస్కులైరి. “చిత్రరథా ! నీవు సర్వజ్ఞుండవు. నీ మూలంబున బ్రహ్మతేజోధికుండైన వసిష్ఠుని మహాత్మ్యమును వినఁగలిగి కృతార్థులమైత్రిమి. మిత్రమా ! అమ్మహాత్మున కిల్లాలై ధన్యురాలైన పుణ్యురాలెవ్వరు ? పురాణదంపతులంబోలు నాపుణ్య దంపతులకుఁబుట్టిన పుత్రులెవ్వరు ? వారును దండ్రియంతటి తపస్సంపన్నులు కా గలిగిరా ?” అని వసిష్ఠ కథాశ్రవణ కౌతూహలంబున నర్జునాదు లెన్ని యో ప్రశ్న లడుగుచుండ నాగంధర్వుండు వెండియు వారికిట్లనియె.

జగత్పావన శీలయైన యరుంధతి వసిష్ఠుని భార్య. అమ్మహా సాధ్వియందు వనికి నూర్వురు పుత్రులు జనించిరి.

అయోధ్యా పురాధీశ్వరుండును నిక్ష్వాకుకుల సంభవుండునునగు కల్మాషపాదుఁడను రాజు మృగయావినోదంబున నొక్కనాడు వసిష్ఠాశ్రమ సమీపారణ్య భూముల విహరించుచు గిరిగహనసంచారంబున నెంతయుడస్సి విశ్రమార్థము దదాశ్రమము వంకవచ్చు చుండెను. అప్పుడు వసిష్ఠ పుత్ర శతంబున కగ్రజన్ముండును నధికతపశ్శక్తి యుక్తుండునునగు శక్తియను మహాముని యయ్యరణ్యంబున నింధనార్థంబు పోవుచు మార్గ మధ్యంబున వాని కెదురయ్యెను. రాజుల దర్శించినంతనే మ్రొక్కుటయుఁ బ్రక్క కుఁ దొలంగుటయు