పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వామిత్రుడు - గర్వభంగము.

13


కాపాడఁగలను? పితృదేవతలను మీవంటి యతిథులను దీనిచేతనే నిత్యమును సంతృపులఁ జేయ కలుగుచున్నాను. అందుచే నియ్యది యన్యుల కీయఁ బడదని బదులు చెప్పెను. తోడనే కోపస్వభావుఁడగు విశ్వామిత్రునకు వసిష్టునిపై దురాగ్రహము జనించినది. " నేను క్షత్రియుండను. నిగ్రహావగ్రహా సమర్థుండను. నీవు బ్రాహణుఁడవు. పరమ శాంతుండవు. నన్నేమి సేయఁగలవు? లక్ష్మి మొడవులనిచ్చెద నన్న నొల్లవైతివిగావున నవశ్యముగ బలిమింజేసియైనను దీనింబరిగ్రహింతు" నని పలుకుచు నందినింబట్టుకొనుఁడని తనసైనికులకు నియోగించెను. పరుల వలన భాధకలగకండ సాధుజనుల రక్షింపవలసిన రాజు తానే సాధుబాధ కుపక్రమించునెడ నింక నెవరేమి చేయఁగలరు ?

గాధేయుని యనుమతి చొప్పున నాతని సైనికులు నందినిం జుట్టుముట్టిరి. కాని యయ్యది వారికిం బట్టువడక, తీవ్రములగు వారిదండ తాడనంబులచేఁ బీడింపఁబడి యఱచుచు పసిష్ఠునొద్దకువచ్చి యిట్లనియె. మహాత్మా ! అధర్మపరులగు నిన్నరులకు నన్నిచ్చితిరే! నన్నేల యుపేక్షించితిరి? ఇది మీకు ధర్మమా? ' వసిష్ఠుడామాటల కేమియుఁ బ్రత్యుత్తరం బీయక యూరకుండె. అందువలన వాని యభిప్రాయం బెఱింగి, తన్ను వారికీయలేదని గ్రహించి; నందిని తన వత్సంబును బట్టుకొను చుండిన సైనికులవంకకుఁ బరుగెత్తెను. తోడనే తక్కినసేనలును నందిని వెంబడించెను. అప్పట్టున