పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

భారత నీతికథలు - రెండవ భాగము.


డట్లు విస్మితుండగుచు నాత్మగతంబున అద్దిరా! శంఖంబులం బోలు కర్ణంబులును మెత్తని వలుద పొదుఁగును గుఱుచలై పొలుచు కొమ్ములును మృదువైన రోమంబులును శరత్కాల చంద్రికా సన్నిభంబైన మేనిచాయయుఁ గల యిమ్మొదవు పెన్నిధిచిక్కిన ట్లిమ్ముని కెట్లు చిక్కెను? దీని నెట్టులైన నేను దక్కించుకొందు" నని నిశ్చయించుకొనెను. అట్టి నిశ్చయముతో విశ్వామిత్రుఁడు వసిష్ఠుని సమీపించి, యిట్లనియె. “మునిచంద్రమా ! మీ యొసగిన యాతిథ్యంబున మేము కృతార్థులమైతిమి. మీ యాజ్ఞనుసారముగ నాశ్రితజనా నందినియగు నందిని సంకల్పమాత్రంబు ననే షడ్రసోపేత భోజనంబుల మమ్ముఁ బరితుష్టులఁ గావించె. సకలభోగంబులు వర్జించి యరణ్యంబులం జేరి వారిభక్షులును బర్ణభక్షులునై తవము చేసికొనుచుండు మీవంటి ఋషులకు మహదైశ్వర్య దాయకంబగు నీ హోమధేనువు వలన నేమి ప్రయోజనం బున్నది? ప్రయోజనము లేకుండుటయే కాదు. అనర్థదాయకంబునుగాఁగలదు. ఈ నందిని కల్పించు భోగంబులయందు మీ కాసక్తి వొడముచుండును. అట్టియాసక్తి వలనఁ దపోభంగము జరుగుచుండును. కామధేనువుంబోలు నిట్టి హోమధేనువు మీవంటి యుత్తమ తపస్వులకడ నుండరానిది. కావున దీనిని నాకనుగ్రహింపుఁడు. నందినికన్న నుత్తమంబులగు నొకలక్ష మొదవుల మీ కిచ్చెద.”

వసిష్ఠుఁడు వానిమాటలకు నవ్వుచు, "రాజేంద్రా ఈచిడిపి కుఱ్ఱకి లక్ష మొదవుల నొసంగనేల? వానిని నేనెట్లు