పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వామిత్రుడు - గర్వభంగము.

11


డస్సెను. అయ్యరణ్య భాగంబున ననతి దూరంబుననే వానికొక మున్యాశ్రమము గానవచ్చినది. అయ్యాశ్రమాంతరంబున గాధేయుం డ్కొక్కింత విశ్రమింపఁ దలంచి మెల్లఁగా నచ్చటఁ జేరుకొనియెను. చేరి ప్రాంతముల సంచరించు ఋషికుమారులం బిలిచి, యతఁ డియ్యాశ్రమ మెవ్వరిదని యడుగ వసిష్ఠమహర్షిదని చెప్పి వారాతని లోనికిఁ గొనిపోయిరి. అప్పుడు మహాత్ముఁడైన వసిష్ఠుఁడు వాని రాక నెఱిగి యెదురేగ వచ్చి యర్ఘ్యపాద్యాదు లొసంగి, విశ్వామిత్రు నతిప్రీతిం బూజించెను. మఱియు రాజును సైనికులను మృగయవిహారంబునఁ గడుంగడు డస్పినవారగటచే నయ్యందఱం గూడ నభిమతాహారంబు లొసంగి పరితృపులఁ గావింపుమని వసిష్ఠుఁడు తన హోమధేనువైన నందినికి నియోగించెను.

మహర్షి యజ్ఞానుసారంబుగ - నా నందిని తన సంకల్ప మాత్రంబుననే ఘృతంబును నదిగాఁ బ్రవహంపఁ జేసెను. అన్న రాసులను బర్వతపంక్తులుగాఁ బేర్చేను. రసపూరితంబులగు బహువిధోప దంశముల ననేకములఁ గల్పించెను. వివిధ భక్ష్య భోజనంబుల సపారంబుగా సృష్టించెను. ఇట్లు తనకును లక్షలకొలఁది గల తన సేనలకును క్షణమాత్రుంబుననే చతుర్విధాహారంబులఁ బ్రసాదించి పరితృప్తులఁ గావింపఁ గలిగిన యా హోమధేనువుం జూచి, దాని యద్భుత కృత్యంబునకు విశ్వామిత్రుం డెంతయు నిశ్చేష్టితుఁడయ్యెను. ఆఁత