పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంవరణ చరిత్రము - పురోహిత ప్రభావము.

7


ఆ వనంబున వేటతమకంబున సంచరించుచు సంవరణుని తురంగము క్షుత్పిపాసా పీడితయై నేలవ్రాలినది. అందువలన నతఁడు పాదచారియయి సంచరించుచుఁ గ్రమక్రమముగ నొక పర్వత ప్రదేశమును సమీపించి, మూకస్మికముగ నచ్చట నిరతిశయ రూపలావణ్యాతి శయములుగలయొక కన్యాలలామంగాంచెను. సంవరణుండామెసు జూచినంతనే యనిమిషలోచనుండై" ఓ హో ఈ హేమగాత్రి తన కాంతిచే నీవృక్ష లతాదులన్నియు బంగారు వికారము నొందుచున్నవి. ఈమె త్రిభువన సామ్రాజ్యలక్ష్మియో, యక్ష కాంతయో, సిద్ధకన్యకయో, యమర సుందరియో కావలయును ! దివ్యాంగనలకైన నిట్టిరూపవిలాస సంపదలుండుట యసంభవము”అని పలువిధముల శ్లాఘించుచు మెల్లఁగ నామెను సమీపించెను. సమీపించి రాజు తత్సౌందర్యావలోకనమునందు నిశ్చలత్వము నొందిన తనచూపు లామె యందె నిలిపి, అబలా! నీ వెవ్వరిదానవు? ఒంటరిగ నివ్వనంబున నేల మెలంగు దానవు?" అని యడిగెను. వాని మాటల కక్కన్య నిరుత్తరయై మేఘమధ్యమున సౌదామినివోలెఁదటాలున మాయమైనది.

ఇట్లదృశ్యయైన యక్క న్యం గానక సంవరణుండు ప్రలాపించుచు మిక్కిలి దుఃఖించుచుండఁ గొంతసేపునకు వానిం గరుణించి మఱల నాసుందరి ప్రత్యక్షమై యిట్లే ల వగచెదవని యడిగెను. తోడనే యతఁడత్యానంద భరితుఁడై, “సుందరీ! అధికప్రతాప బలదర్పంబున రాజలోకమున కెల్ల నేనే పెద్ద .