పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

- - (10) సైంధవుఁడు - కరస్త్రీ వాంఛాఫలము, 113 అపలుకులకుఁ బాంచాలి ప్రకంపితచిత్తయై "సైంధ వా! కౌరవ పాండవులకుఁ జెల్లెలైన దుస్సలకు నీవు పతివి. నాకుఁ దోఁబుట్టువ నగుదువు. నీవిట్లాడవచ్చునా?" అని మంద లించుచుండ నాధూర్తుఁడు, " పాంచాలీ! స్త్రీల యెడ రాజులకు వావి వెదకఁ బని లేదు. నీవు రాకున్న బలిమి నైన నిన్నుఁ గొంపోయెద నని కఠినముగ జెప్పెను. అప్పుడామె క్రోధకలుషి తాంత రంగయై ఓమూత్ ! మహావీరుల ధర్మ పత్ని నైన నన్ను సామాఖ్య వనితగా భావించి వదగుచున్నావు? అమహాత్తు లేఱింగి రేని నీప్రాణములఁ బరమేశ్వరుండైన రక్షింప లేదు. ఊరక చెడక నీదారిం బొము. "పాండవ సి.హంబుల కక పుట్టింపకుము. నీ పాపబుద్దినిఁ బరిత్వ జింపు" మని పెక్కువిధముల బోధించుచుండ, నప్పా పాతుండు తటాలున నామె పయ్యెదకొంగుఁ బట్టుకొనెను. పుకొనినంతనే కృష్ణ యొడలుమఱచి, ధాతి శయంబున నొక్కటి వేసినంతనే, యామ్రాటున పోఁడతి చిత్రంబుగ నేల పై ఁ దెళ్ళే. ఇట్లు నేలంబడి తడయక లేచి జయద్రథుండామెను బలిమిని రథంబుపై నిడుకొని పోవుచుండెను. ద్రౌపది యోశించుచు ధౌమ్యుంబిలచి, “ఈ సైంధవాధముఁడు నన్నుఁ గొనిపోవు చున్నా" డని చెప్పెను. ధౌమ్యుఁడు భయ విస్మయంబుల సైంధవుని గాంచి “ఇట్టి దుస్సాహసంబు వదలు" మని యనేక విధముల బోధించెను. కాని వాడు వినక యప్పుడే బయలు దేటి ప్రయాణమును సాగించెను. కొంత సేపునరుఁ బాండవు లేవురు నాశ్రమమునకు వచ్చినంతనే ధాత్రికయను పరిచారిక బోరున నేడు చు