పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారత నీతి కథలు - రెండవ భాగము.

నెట్టేయఁగలమని తల్లిదండ్రులు విచారింపఁజొచ్చిరి. ఆసంగతి యెఱింగి సుగుణసముద్రయైన లోపాముద్ర జననీ జనకుల మనో వేదన తొలంగించి ఆ నగస్త్యునిఁ దప్ప నన్యుల సంగీకరింపనని చెప్పెను.

కూతు మనోరథం బెంగి రాజదంపతులమందానంద భరితులై విధ్యు క్తంబుగా నక్క న్యక నగస్త్యునకు వివాహంబు చేసిరి. అగస్త్యుఁడు లో పొముద్రను బరిగ్ర హించి, యామె దివ్యాంబరాభరణము లపనయించి, వల్క... లాజినధారిణిం జేసెను. వివాహానంతరమున నమహర్షి భార్య తోఁగూడ గంగాద్వారమునకు వచ్చి యచ్చటఁ దపము ప్రారంభించెను. అనుదినమును నతిభ క్తితో లోపాముద్ర గావించు శుశ్రూష గతఁ డెంతయు సంతుష్టుండై యొకనాడం నీకెయ్యది యిష్టంబని భార్యని గెను. “ప్రాణేశ్వరా ! మనమిరువురమును లేపనమాల్యాభరణ దివ్యాంబరముల సలంకృతులమై యుండుటకు నామది కోరుచున్న" దని చెప్పెను. అగస్త్యుం 'మెగం నితమును మన్నించి, తపమును వెచ్చించి ధనము సృష్టించుట కిష్టపడక పురుకుత్స కుమారుండైన త్రసదస్యుఁడను రాజు పాలి కేగి, ( నేను ధనారి నై వచ్చితీ. నీపోష్య జనపోషణంబునకు విఘాతంబు గాకుండ మిగిలిన ధనంబుగల దేని నాకిమ"ని యడిగెను. త్రసదస్యుండును, “ మహాతా! ఇమణిమతీ పురంబున నిల్వల ందును వాతాపియునను నన్నదములు గలరు. -