పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రవేత్తయైన 'ఎమర్సను' చెప్పిన విధమున, బెంజమినును బోలిన వారిని రాతిమీఁదనుంచినను వారు వేఱుదన్నెదరు. ఒకనాఁటి సాయంకాలమున, హ్యూమెరిడిత్తు, అను వాఁడితని యొద్దకువచ్చి, ముచ్చటించుచు, కీమరు ఋణముల పాలయిన సంగతిని జెప్పెను. ఇంతకును, కీమరు పని నేర్పు లేనివాఁడు. ఇంతలో నంతలోనో, వానిపని ముగియుననియు, వారు స్వంత ముగ ముద్రాక్షరశాలను స్థాపించుట కవకాశ ముండు ననియు, వారు పలుకుకొనిరి. మెరిడిత్తు మదుపుపెట్టి, కావలయు సామానులను దెప్పించుటకు, నిరువురుకలిసి పనిచేసి, లాభములను సమముగ పుచ్చుకొనుటకు సమ్మతించిరి.

గవర్నమెంటు నోటుకాగితములను ముద్రించుటకు కీమరుని నియోగించిరి. వానిచేతిక్రిందివా రెవరీపనిని బాగుగజేయ లేరు. అందుచే, బెంజమినును గోపముమాని పనిలో జేరమని , వాఁడు వేఁడెను. బెంజమిను పనిలోఁదిరిగి ప్రవేశించెను. అందుచేత, రెండుమూఁడుసంవత్సరములవఱకు కీమరుయొక్క వ్యాపారము సాగెను. కావలసిన అచ్చులు సిద్ధముకాఁగానే, న్యాయశాస్త్రాధికారుల యెదుట ముద్రించుటకు, వీరిరువురు కలిసి 'బర్లింగుటను' పట్టణమునకుఁ బోయిరి. ఈ సమయముననే, వారిపరిచయము వీనికి గలిగెను. "నామనస్సు పఠనమువలన పరిపక్వము నొందినందున, నాసంభాషణయందు వారిచ్ఛకలిగి