పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నష్టమును బొందును?" "వీరిలో నెవరు సుఖజీవులు?" వీనిని సమాజములో బూర్వోత్తరముగ సమన్వయించుచుండిరి.

దీనిని స్థాపించిన కొన్ని రోజులకు, బెంజమిను దీనిని విడిచివేయవలసి వచ్చుననుభయము కలిగెను. కీమరు ముద్రాక్షరశాలలో బనిచేయుచు, 6 మాసములు సుఖముగ బెంజమిను గడిపెను. పూర్వమువలె, బెంజమిను దగ్గరకు జేరనీయక, కీమరు వానిని దూరముగ నుంచుచు వచ్చెను. ఇంతలో కీమరు యొక్క వ్యవహారము తగ్గినది. అతని ఋణములు లావయ్యెను. అయినను, నతని పనివాండ్రందఱు, బెంజమినుచే శిక్షింపబడి, పనిలో దేరి పారిరి. అందుచే, హెచ్చు వేతనమిచ్చి బెంజమినును పనిలోనుంచుటకు కీమరు కిష్టము లేక పోయెను. ఏదో చిన్న జగడము తెచ్చి, కీమరితనిని కోపగించెను. అందుకు రోషముకలిగి, బెంజమిను పనిమాని లేచిపోయెను.

గృహమునకుబోయి, శాంతుడై తానుచేసిన పనిని బెంజమిను వితర్కించెను. బోస్టనుపట్టణమునకు బోవలెనని యితడాలోచించెను. నాలుగు సంవత్సరములనుండి స్వగృహమునకు వెళ్లలేదు. ఈ లోపున తానుచేసిన పనులేమియు మంచివి కావని బెంజమి నను కొనెను. ధనమైనను గూడ బెట్టలేదు. వెర్నను కియ్యవలసిన సొమ్ము నియ్య లేదు.