పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(4) "సత్యమును సత్యమునకే బ్రేమించెదను. నిష్పక్షపాతముగ సత్యమును తెలిసికొని, దాని నితరులకు తెలియజేయుదును." ప్రతి శుక్రవారము సాయంత్రము సమాజమువారు సభచేయుచుండిరి.

సమస్త శాస్త్రవిషయముల నీ సభలో వీరు తర్కించు చుండిరి. ఇందులో వాదముచేయుట కలదు.

"సత్యమును తెలియుటకు వివాద మాడవలయునుగాని, జగడ గొండితనము గూడదు" అని బెంజమిను వ్రాసెను. ఈ సమాజాభి వృద్ధికొఱకు బెంజమును కష్టపడుచుండెను. ఈ సమాజములో ముచ్చటించిన విషయముల నిందు పొందుపఱచుచున్నారము.

"స్వలాభమునకా, మనుజులు పనిచేయుచున్నారు?" "ఉద్దేశము మంచిది, చేసినపని చెడుపని, దురుద్దేశము, చేసినపని మంచిది - వీనిలో నేది శ్రేష్ఠము?" "వేదాంతము యొక్క లక్ష్యము, కోరికలను భేధించుటయా?" "సౌఖ్యమన నేమి?" "మనుజుడు జీవిత కాలములో బూర్ణత్వమునుబొందగలడా?" "బుద్ధి, మంచినడవడియు గల బీదవాడు, బుద్ధి మంచినడవడియు లేని భాగ్యవంతుడు - వీరిలో నెవరి స్నేహము మంచిది?" "వీరు మృతినొందిన, వీరిలో నెవరి మరణము వలన దేశము