పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరి పదియారు దినములకు, తట్టుమీదనుండు వారి కానందమును గలుగ జేయుచు, యోడయొక్క చౌకివాడు "భూమి, భూమి" యని యఱచెను. "అందరివలె నేను వేగముగ జూడ లేక పోతిని. నానేత్రము లానంద బాష్పములతో నిండెను". అని బెంజమిను వ్రాసెను. మరి రెండు రోజులు గడచినపిదప, ఫిలడల్‌ఫియా కారుమైళ్లు దిగువగ, డెలవేరు నదిలో సాయంత్రము 8 గంటల కీ యోడలంగరు వేసెను. "విహారార్థము పడవనెక్కి, ఫిలడల్‌ఫియాలోని బాలురు కొందరు దైవికముగ వచ్చి, మాయోడ తట్టునెక్కి, మమ్ముల నొడ్డుకు దీసికొనిపోవుటకు సమ్మతించినందున, మేము వారితో బడవలోనికి దిగి, 10 గంటల కొడ్డునజేరితిమి. విసుగు పుట్టించి భీతావహమై సముద్రపు ప్రయాణమును దుపద్రవముగ జేసినందు కొకరికొకరు వందనములు చేసికొని, మేముందఱము దైవకటాక్షమును గొని యాడితి"మని బెంజమిను వ్రాసెను.

ఓడదిగి, ఫిలడల్‌ఫియావీధులలో బోవుచుండగ, నుద్యోగమునుండి తొలగింపబడిన గవర్నరు కీతును బెంజమిను నాకస్మికముగ దారిలో జూచెను. నిర్హేతుకముగ బెంజమిను మోసపుచ్చినందుకు, సిగ్గుపడి, బెంజమినును బలుకరించక, కీతు వెళ్లిపోయెను. దరిద్రుడు, అలక్షితుడునునై, జీవనార్థము నూతన సీమలచారిత్రములను వ్రాయుచు, మరి పాతిక సంవత్సరములు