పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగ నుండెను. ఇంటిలో మనుజుని సహాయమావశ్యకమని యెంచి, యిల్లుగలామె తక్కువ సొమ్ముకు బసనిచ్చెను. అంతలో, వారముకొకరూపాయి యద్దెకు బసదొరకునని తెలిసి, యక్కడికి పోవుటకు బెంజమిను యత్నించెను. ఇతనియందు గరుణగలిగి, సాయంసమయముల నితని సంభాషణములకు సంతసించి, యితను తన బసనుండి వెళ్లుట కిష్టపడక, రూపాయి యద్దెకొడంబడి, ఆమె తన బసలో బెంజమిను నుంచివేసెను. "ఈ యద్దె నిచ్చుచు లండనులో బసచేసి యుంటి"నని బెంజమిను వ్రాసెను. వీరిరువు రన్యోన్య మైత్రితో గాలమును గడిపిరి. మాటలును, కధలును చెప్పి, ఆమె బెంజమినుకు సంతోషమును గలిగించుచుండెను. ఆమె వయోవృద్ధు-కాలులే నందున, సాధారణముగ నిల్లువిడిచి బయటకు బోవుటలేదు. దయార్గ్రహృదయురాలు. ఆమె సాంగత్య మితనికి సంతోషమును గలిగించినందున, వీలు లేదని చెప్పక యామె పిలిచినపుడెల్ల మాటలాడుటకు బెంజమిను వెళ్లుట కలదు.

వాట్సు ముద్రాక్షరశాలలో నితనితో గలిసి పాటుపడు వారలలో 'డేవిడుహాలు' అను వానిని బెంజమిను బాగుగ నెరుగును. ఇతడు ఫిలడల్‌ఫియాలో జాలకాలము బెంజమినుతో సహకారియై యుండెను. 'వై గేటు' అను మఱియొకనిని