పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బెంజమిను వ్రాసెను. అనేకు లితని నిజూచి మద్య పానమును విడిచిపెట్టిరి. మద్యముకన్న గంజి నీరు శ్రేష్ఠమని యాంగ్లేయులకు బెంజమిను నమ్మకము పుట్టించినందున జీవదృష్టాంతముయొక్క మహిమ యేమని జెప్పవచ్చు? మద్య పానము విడుచుటవలన, వ్యయము తగ్గుటయేకాక, బుద్ధినిర్మలముగ నుండును. "దినమంతయు మద్యమును బుచ్చుకొనువారు, సొమ్ములేక, దుకాణములో పరపతిని బోగొట్టుకొనినందున, వారికి నేను సొమ్ము నియ్యవలసి వచ్చుచుండెను" అని బెంజమిను వ్రాసెను.

ఇటు లందరిని సురాపాన విముఖులుగ జేసి, ప్రతికూలముల కెదురుగ నడిచి, ముద్రాక్షరశాలలోని కొన్ని నిబంధనల నుపయుక్త మగునటులు మార్చెను. అక్షరములను గూర్చుటయందు హస్తలాఘవము చూపి, సతతపరిశ్రమచే యజమానికృపను సంపాదించి, క్రమ క్రమముగ హెచ్చు వేతనముల కెక్కి సుగుణగణ విరాజమానుడయి కొంత సంప ద్వైభవముల నందెను.

బెంజమిను ధనమునుకూడ బెట్టవలయునని గృహకృత్యములను పోణిమితో నిర్వహించుచు వచ్చెను. "డ్యూకువీధి"లో నొక బసను మాటలాడి, వారమునకు సుమారు మూడు రూప్యము లిచ్చుట కొప్పుకొని, ముద్రాక్షరశాలకు సమీప