పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుడు తాను దప్ప మరియెవరు నతని కింగ్లాండులో లేరనియు బెంజమినుకు దెలియును.

గవర్నరు చేసిన ఈసహింపరాని పితలాటకమును గుఱించి, బెంజమిను వ్రాసిన యాక్షేపణ న్యాయముగ శ్లాఘింపబడి యున్నది. "అజ్ఞానులైన బీదకుఱ్ఱవాండ్రను నిర్హేతుకముగ మోసపుచ్చి వారియెడల కపటముగ ప్రవర్తించిన గవర్న రెట్టివాడని యూహింపవచ్చును? అట్లుచేయుట, మొదటినుండి యతని కలవాటుగ నున్నది. అందఱను సంతోషపెట్టవలె నని యభిలషించి, వారి కిచ్చుట కేమియు సొమ్ములేక, వారికి యాశమాత్రము గవర్నరు చూపించుచుండెను. ఇంతకుతప్ప, మిగిలిన విషయములలో వివేకమును, చురుకుదనమును కలిగి, మంచి లేకరియై, ప్రజలను బాగుగపరిపాలించువాడు", అని బెంజమిను వ్రాసెను.