పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుత్తరము. వీడు దుర్మార్గుడని కొద్దిరోజులక్రిందట నేను వినియుంటిని. వీనితో నా కేమిపని? వీని యుత్తరములను జూచుట యేల? అని కోపగించి, యుత్తరము పారవైచి, తనఖాతాదారునికి గావలసిన వస్తువుల నిచ్చుటకు దుకాణదారుడు వెళ్లెను.

మిగిలిన యుత్తరములు గవర్నరు వ్రాయనటులు బెంజమినుకు దోచెను. ఇన్ని రోజులకు గవర్నరుయొక్క సౌజన్యతను సందేహించి, యోడలో బరిచయముగలిగిన "డెనుహము"తో సకృచ్ఛముగ నీ సంగతిని బెంజమిను చెప్పెను. క్షణములో సంగతిని గ్రహించి, గవర్నరు బెంజమిను విషయమై యెవరికి నుత్తరములు వ్రాసియుండ డనియు, గవర్నరుమాట లవిశ్వసనీయము లనియు, గవర్నరుకు బరపతిలేదనియు బెంజమినుతో 'డెనుహము' చెప్పెను. మనోధైర్యముచెడినవాడై, డబ్బులేదని బెంజమిను డెనుహాముతో జెప్ప, "ఇక్కడి ముద్రకులతో గలిసి పనిచేసిన, నీవు లాభమును బొందగలవు. అమెరికాకుపోయి స్వతంత్రముగ బనిచేయుటకు సమర్థు డ వగుదువు" అని డెనుహాము బెంజమినుకు సలహాయిచ్చెను.

రెట్టించిన యధైర్యమును గలిగించుటకు, రాల్ఫు లండనులోనె యుండిపోయెద నని బెంజమినుతో జెప్పెను. రాల్ఫు డబ్బు లేని వాడనియు, కాసిచ్చి సహాయము జేయు స్నేహి