పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేరి, వాని డబ్బును బుచ్చుకొనుచు, పనిలో బ్రవేశించి ఋణమును దీర్చెద నని చెప్పుచు, శరీరముపైని స్మారకము పోవునటులు దప్పత్రాగుచుండెను. ఒక నాడు, వీరిరువురును, మరి కొందఱును గలిసి విహారార్థము పడవనెక్కి నదిమీద బ్రయాణమయిరి. వారొండొండపడవను గడపుచుండిరి. అపుడు కాలిన్సు పడవగడపవలసివచ్చెను. అతను పడవను గడప నని మూర్ఖించెను. అందుపైని స్నేహితు లిరువురుగలహించి పోట్లాడినందున, నీత నేర్చినవాడని తెలిసి, బెంజమి నితనిని నీటిలోనికి బడద్రోసి, కడమవారితో బడవను గడపుకొని పోయెను. ఈదుకొని పడవదగ్గిఱకు కాలిన్సు వచ్చినను, పడవనుగడపుట కిష్టపడిన లోనికి రానిచ్చెద మని వీరు చెప్ప, వాడుగడప నని బదులు చెప్పినందున, పడవను దోసికొని దూరముగ వీరు వెళ్లిపోయిరి. కాలిన్సు మండి పడెను. ఈదుటచే బడలినవానిని కరుణించి, పడవలోనికి వారు లాగుకొనిరి. అనంతర మంద రాగట్టు జేరి, స్వగృహములకు వెళ్లిరి. తరువాత స్నేహితు లిరువురు సఖ్యతగ నుండలేదు.

ఎక్కడను న్నను, బెంజమినునుబోలిన సాధువు లితరులను స్నేహము జేసికొనకయుండరు. ఇప్పుడితనికి మువ్వురు స్నేహితులు గలరు; ఇతనివలె, సంసారపక్షముగ నున్నవారు. కొంచెము నడవడిలో భేదమున్నను, గ్రంధావలోకనాసక్తి వీరిని దగ్గఱకు