పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెను. ఈయోడ ప్రతి రేవును దాకుచు సంవత్సరమున కొక పర్యాయము, ఫిలడల్‌ఫియానుండి బయలుదేరి లండను పట్టణమునకు బోవుట వాడుకయై యున్నది.

ఓడ బయలుదేరుటకు కొన్ని నెలలు కాలమున్నందున బెంజమిను వెర్రిబాగులవాడైన గవర్నరుకు పనులుచేయుచు, తమయుభయులకు జరిగినమీమాంస యెవరికిని చెప్పక కాలము గడుపు చుండెను. అందుచేత, నీ గవర్నరు డాంబికములు, యప్రామాణికములు, వ్యర్థము లైన మాటలను జెప్పిజనరంజకమును గోరువాడని, బెంజమినుతో జెప్పుట కవకాశ మెవరికిని గలుగలేదు. అతని మాటలను నిండుగ విశ్వసించి, సుఖముగ నాగామిచింతతో ననేక నెలలు గడిపెను. ఓడకు నిరీక్షించుచు, ఏ మాసముల నీ చింతతో గడిపెనో, యామాసము లీయనకు సంతోషాస్పదము లయినవి యని బెంజమినుకు దోచెను. ఆశానుకూలసుహృదై శ్వర్యయౌవనోపేతుడై, స్వమోహాంగీకారమోహినీలాలిత నిర్భర చేతస్కుండై, కాలమును బనులలో నెమ్మదిగ నడిపి, దినములు పండుగలవలె బెంజమిను వెళ్లబుచ్చెను.

ఎంతనెమ్మదిగ గాలమును వెళ్లబుచ్చుట కభిలషించినను, మధ్యమధ్య గొన్ని యవాంతరములు వచ్చుచుండును. జాను కాలీన్సు, సోమరియై, పనిపాటలు చేయక, బెంజమిను బసలో