పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కముగ నడవలేదు. అతని సలహా బాగులేదు. మనుజులలో జాల వ్యత్యాసముగలదు. ఈడుతో విచక్షణరాదు. యౌవన పురుషులు విచక్షణలేక యుండరు. నిన్ను పనిలో బెట్టుట కతనికిష్టములేదు గనుక నేనట్లు చేసెదను. ఇంగ్లాండునుండి తెప్పింపవలసిన వస్తువులను పట్టీ వ్రాసియిమ్ము. నేను వానిని దెప్పించి నీకిచ్చెదను. నీకు డబ్బుకలిగినపుడు, ఆఋణమును దీర్పవచ్చును. ఈ గ్రామములో దెలివిగల ముద్రకు డొకడుండవలయును. అదితప్పదు. నీవాపనిని బాగుగ నెరవేర్చెదవని నా నమ్మకము" అని గవర్నరు చెప్పెను. ఈ మాటలనువిశ్వసించి, యుత్సహించి, కావలసిన వస్తువులను నూరుకాసులు విలువగునటులు పట్టీవ్రాసి బెంజమి నుగవర్నరు చేతికిచ్చెను. ఈ జాబితాను గవర్నరు పుచ్చుకొని, బెంజమిను స్వయముగ నింగ్లాండు వెళ్లి కావలసిన వస్తువుల నెంచుకొని వానిని కొనుట మంచిదని యతనితో జెప్పెను. "ఇంతియకాదు. ఒక పర్యాయము నీ వక్కడికి వెళ్లిన, నలుగురు ముద్రాక్షర శాలాధికారులతోను, పుస్తకముల దుకాణదారులతోను సహవాసము జేయుటకు నీ కవకాశము గలుగును" అని గవర్నరు చెప్పినమాటను బెంజమినువిని, పరమ సంతోషమును లోలోపున బొంది, వెంటనే సమ్మతించి నందున, "నీ సమ్మతము బాగుగనున్నది. వెంటనే ప్రయాణ మగుము, ఓడకస్తాను 'ఆనిస్సు'తో గలిసి, వెళ్లుమని" గవర్నరు నుడి