పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"డెల వేరు నదిమీద దిగువగ వెల్లుచున్న నొకపడవలో నేను పోవుచుంటిని. గాలిలేనందున పడవను గట్టివేయవలసి వచ్చెను. పడవమీద నెండనిప్పులు కురియుచుండెను. అందులోని వారినెవరిని నేనెఱుగను. పడవలో నుండుటకు గష్టముగ నుండెను. ఒడ్డుననేదో పచ్చికబయలుకలె నొకటి నాకు గనబడెను. దాని మధ్య నొక వృక్షమును జూచితిని. పడవ నడచువఱకు, చెట్టునీడకుపోయి పుస్తకమును జదువుకొనవలె నని కోరి, పడవయధికారి నడిగితిని. వాడు సమ్మతించినందున, నే నొడ్డున చేర్ప బడితిని. ఈ ప్రదేశము చాలభాగము చిత్తడి నేల యగుటవలన, మోకాలుబంటి బురదలో దిగబడి, కష్టముతో జెట్టు చేరితిని. ఇక్కడ నైదునిమిషముల కాలమైన వ్యయము కాకమునుపే, వందలకొలది దోమలువచ్చి, నా కాళ్లు, చేతులు, ముఖమును గఱచి వేసినవి. అక్కడినుండి తిరిగి, యొడ్డునకువచ్చి, తెప్పమీద దాటి, పడవలోనికి బోతిని. ఎండబాధ భరింపవలసివచ్చెను. ఇతరుల పరిహాసమునకు బాలయితిని. సంసారములో దీనింబోలిన విషయము లనేకములు నాకు దృగ్గోచరము లయినవి".

తండ్రి వ్రాసియిచ్చిన యుత్తరమును బెంజమిను గవర్నరు కీతునకు కనపఱచెను. పట్టినపట్టు విడువక, బెంజమినును పనిలో బ్రవేశ పెట్టుటకు గవర్న రుపగమించెను. "నీతండ్రి వివే