పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చితిని. వారునన్ను మర్యాద జేసిరి. వారి పుస్తక భాండాగార ముండిన గదిలో మేము గొంతవఱకు మాటలాడితిమి. నన్నంపకము పెట్టుటకు వారు నాతోవచ్చునపుడు, నేను వారితో మాటలాడుచుంటిని. మాటలసందడిని, దారిలోనున్న దూలమును నేను చూడనందున, వారు 'శిరస్సువంచు, వంచుమని' ప్రక్కనుండి నాతో జెప్పిరిగాని, నాశిరస్సు దూలముదాకి దెబ్బతినువఱకు, నేను వారిమాటను గ్రహింప లేక పోతిని. సమయోచితముగ బుద్ధిని గఱపువారుగాని, 'నీవు బాలుడవు, ఈ ప్రపంచములో శిరస్సువంచుకొని, నీవు తిరిగిన, ననేకములుగ దెబ్బలు తినవ,ని నాతో వారు చెప్పిరి. ఈసలహా నాశిరస్సున నాటినందున, నేను బాగుపడితిని. శిరస్సు లెత్తుకొని, తమకు శృంగ భంగము జరిగి, విపత్తుల ననుభవించువారిని చూచినపుడు, నాజ్ఞప్తికిసలహావచ్చుచుండె'నని బెంజమిను వ్రాసెను.

తలిదండ్రుల దీవనలుపొంది, జ్ఞాపకార్ధమై వారిచ్చినవస్తువులను బట్టుకొని, వారిసెలవుగైకొని, బెంజమిను పడవ నెక్కెను. ఆపడవ 'న్యూపోర్టు' పట్టణమునకు వచ్చెను. అక్కడ బెంజమిను పడవదిగి, తనయన్న 'జాను'ను జూచుటకు వెళ్లెను. అన్నదమ్ములుకలిసికొని, పరస్ప రాహ్లాదముతో గొంతమాటలాడిరి. 6, 7 సంవత్సరములకు బూర్వము వీరిరువురు దండ్రికి బనిలో సహకారులై యుండిరి. ఇట్లు, న్యుపోర్టులో గొంతకాల