పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలిసిన సంగతులను మామగారితో జెప్పెను. 18 సంవత్సరములు వయస్సుగలిగి, యుక్తాయుక్త విచక్షణ తెలియని బెంజమినును స్వతంత్రముగ వ్యాపారమునందు ప్రవేశ పెట్టింపుమని వ్రాసినందుకు, గవర్నరంత తెలివికలవాడుగ కనపడం డని తండ్రి పలికెను. అల్లుడెంత దూరము బావమఱది విషయమై నొక్కి చెప్పినను, జోషయా ఫ్రాంక్లిను చెవి నొగ్గలేదు. కుమారుని యోగ్యతను గవర్నరు శ్లాఘించినందుకు, తండ్రి సంతసించెను. 21 సంవత్సరము వఱకు ఫిలడల్‌ఫియాలో బనిచేసి, కొంతధనమును గూడ బెట్టినపిదప, కొఱత పడినసొమ్మును దా నిచ్చుట కంగీకరించి, తదనంతరము కుమారు డచ్చుయంత్రమును కొని స్వతంత్రముగ జీవింపవచ్చునని, తండ్రి సలహా యిచ్చెను. కుమారుని విషయమై గవర్నరు స్తోత్రముగ వ్రాసినందుకు మన్నించి, వానిసలహా ప్రకారము నడచుట కప్పటి కవకాశము లేదని క్షమాపణ పూర్వకముగ వానికి తండ్రి జాబువ్రాసి పంపెను.

ఈ సమయములో నొక ముచ్చటజరిగెను. ఆముచ్చటను, 60 సంవత్సరముల వయస్సున బెంజమిను, కాటను మేధరుగారి కుమారుని జాబువ్రాసి పంపెను. 1724 సంవత్సర ప్రారంభమున, నేను మీతండ్రిగారి నాఖరుపర్యాయము సూచితిని. ఆ సమయమున నేను పెన్సిలువానియాకు మొదటిమారు వెళ్లి