పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దగిన సహాయము జేయుట, గవర్నరు వ్రాసియిచ్చిన శిఫారసు ఉత్తరమును బట్టుకొని తండ్రియొద్దకు బెంజమిను వెళ్లుటయు మొదలగు సంగతులను వీరుమాటలాడిరి. ఈ సంగతులను రెండవవానికి తెలియనీయక, యధాప్రకారము కీమరు యొద్దనే బెంజమిను పని జేయుచు, సాధ్యమయినంత వేగముగ బోస్టనుపట్టణమునకు వెళ్లవలసినదని వీరు నిర్ణయించిరి. అప్పుడప్పుడు గవర్నరు తన గృహమునకు బెంజమినును భోజనమునకు బిలుచుచుండెను.

1724 సంవత్సరము యేప్రిల్ నెలాఖరున నొక పడవవచ్చినందున, బెంజమిను దానిమీద బయలుదేరి వెళ్లెను. తల్లిదండ్రులను జూచివచ్చెద నని నలుగురితో జెప్పెను. రెండు వారములు తుపానులో ప్రయాణముచేసి, బోస్టను పట్టణము చేరెను. అన్నయైన జేమ్సుకు తప్ప, మిగిలిన వారికి సంతోషము కలుగునట్టులు బెంజమిను స్వగృహము జొచ్చెను.

పెన్సిలువానియా పరగణాలోని విశేషములను బెంజమిను వలనవిని, ఇతని పూర్వపు స్నేహితుడు కాలిన్సు తపాలాఫీసులోని పనిని విడిచిపెట్టి, వెంటనే తన సామానును పడవలో వేయించి, నాటున వాడు బయలుదేరి వెళ్లెను.

శిఫారసుత్తరమును జదివి, యేమియు జెప్పక, తండ్రి యూఱకుండెను. ఇంతలో, హోమ్సువచ్చి, గవర్న రునుగుఱించి