పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టకు దగిన సన్నాహముజేయ వారిరువురు యత్నించిరి. ఇందుచే, హోమ్సు బావమఱదికి వెంటనే ప్రత్యుత్తరము వ్రాయ లేక పోయెను. కొన్ని మాసములు గడిచినపిదప, బావ మఱుదు లిరువురును గలిసికొనిరి.

ఒక రోజున, బెంజమిను యజమానితో గలిసి శాలలో బనిచేయుచున్న సమయమున, నిద్దరు పెద్దమనుష్యులు అచ్చాఫీసులోనికిరాగా, వచ్చిన వారిలో నొకడు గవర్నరుకీతు, రెండవవాడు 'కర్నలుఫ్రెంచి' గా, వీరిరుగురిని తెలిసికొని, తన నిమిత్తము వచ్చినవారని గ్రహించుకొని, మేడదిగివచ్చి, వారిని కీమరు మర్యాదచేసెను. కొంతవఱకు కూర్చొని, గవర్నరు ఎవరు ఫ్రాంక్లినో కీమరువలన తెలిసికొని, బెంజమినుతో మర్యాదగ మాటలాడి, యతనిని స్తోత్రముచేసెను. అంత కాలమువఱకు తనను బెంజమిను చూడనందుకు నిష్ఠురమాడి, యొక విరామస్థలమున కతనిని రమ్మనుమని చెప్పి, కర్నలు ఫ్రెంచితో గవర్నరులేచి వెళ్లెను. ఫ్రాంక్లిను, కీమరు, లుభయు లాశ్చర్య మగ్నులయిరి. కోరిన ప్రకారము వారిని దర్శించుటకు బెంజమిను వెళ్లెను. వా రితనితో కొంతవఱకు మాటలాడి, తుద కితని నేవ్యాపారమునందు నియోగించుట యని యోచించిరి. తండ్రి సహాయముచే బెంజమిను స్వంతముగ నొక ముద్రాక్షరశాలను స్థాపించుట, గవర్నరందులకు