పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుగు సామాను పడవనాయకుడైన, 'రాబర్టు హోమ్సు'ను వివాహ మాడినటులు దెలిసెను. ఫిలడల్‌ఫియాకు 40 మైళ్లు క్రిందుగనుండు పట్టణములో గాపురము జేయుటచే, పరారియైన బావమఱది ఫిలడల్‌ఫియాలోనున్న సంగతిదెలిసి, బెంజమినుకు హోమ్సు జాబువ్రాసెను. అందులో తలిదండ్రు లితని విషయమై దు:ఖాక్రాంతులై యుండిరనియు, నితనిని వారి యొద్దకు వెళ్లుమనియు, వెళ్లి వారిని సంతోషపఱచుట ఇతనికి శ్రేయోదాయకమనియు వ్రాయబడియుండెను. బోస్టను పట్టణమును విడుచుటకు గారణము విరివిగవ్రాసి, తాను ఫిలడల్‌ఫియాలో నుండుటకు నిశ్చయించినట్లు, బెంజమిను తన బావమఱదికి దెలియజేసెను.

ఈ యుత్తరము బెంజమినుకు లాభకర మాయెను. దీనిని హోమ్సు చదువుచున్న సమయమున, 'పెన్సిలువానియా' 'పరగణాగవర్నరు 'సర్‌విల్డియంకీతు', తన వద్దనుండినందున, బావమఱదివ్రాసిన నిర్దుష్టశైలిగల లేఖను గవర్నరుకు జూపించెను. వీరిరువు రా లేఖను జూచి సంతోషించి, యామాదిరి నితరులు వ్రాయ లేరనియు, 'బ్రాడుఫర్డు' డజ్ఞానావృతుడనియు, కీమరు మూడుడు దొంగయనియు, తమలో దాము బలుకుకొనిరి. బెంజమినును ప్రోత్సాహము జేయవలెనని యెంచి, ఫిలడల్‌ఫియాలో నతనిచేస్వంతముగ ముద్రాక్షరశాలను స్థాపింప జేయు