పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పత్రికకు ప్రతిగా, మఱియొక పత్రికను తమ వ్యవహారానుకూలముగ ముద్రింపించి ప్రచురించుటకు పూనుకొనిరి. తపాలాఫీసు యజమానత్వమునకు క్రొత్తగ వచ్చినవానిని వీరు ప్రోత్సాహపఱచుటకు నిశ్చయించుకొనిరి. ఇదియంతయు బెంజమిను పనిలోబ్రవేశించిన రెండవసంవత్సరమున జరిగెను. ఈవార్తా పత్రికకు తనను సంపాదకునిగా నియోగించెద రని నితనియన్న యువ్విళ్లూరుచుండి తుదకు విఫలమనోరధుడై "బోస్టనుగెజెటు" అను పేరుతో, నూతనముగ వార్తాపత్రికను సిద్ధపఱచుటకై చాలధనమును వ్యయపఱచెనుకాని, అచ్చట తుదకు స్వల్ప కలహములు తటస్థింప దానినిగూడ విడువవలసిన వాడాయెను. తక్కుంగలవారు ఈపత్రికను మఱియొకనిచే నడిపింపసాగిరి. వారటులు చేయుట ద్రోహమనియెంచి, జేమ్సు తన స్నేహితులు యెంత చెప్పినను వినక, కార్పణ్య బుద్ధివహించి, యొక పత్రికా ప్రచారమునకే యెడములేని సందర్భమున మూడవ పత్రికను బ్రచురించుట కుద్యుక్తుడై, 1721 సంవత్సరము ఆగష్టు 17 తేది సోమవారమున, "న్యూఇంగ్లాండుకో రాన్టు" అను వార్తాపత్రికయొక్క ప్రధమసంచికను స్వంతముగ ప్రచురము జేసెను.

నూతన సీమలలో బ్రచురింపబడు పత్రికలయందుల బ్రముఖమై, లోకోపకార బుద్ధిగలిగి, సాహసముతోను సరసముగాను చదువరులకు ప్రకరణములను ప్రదర్శించు చున్నందున,