పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మప్పుడు సహితము తన జన్మస్థానము నత్యాదరముతో స్మరించుచు వచ్చెను. నిర్మలహృదయముతో స్వచ్ఛందముగ క్రీడలయందు విహరించిన ప్రదేశములందు దిరుగసంచరించుట కెంతయుగోరికోరి, యలభ్యమని యెంచి, బోస్టనుపురవాసులతో సంగమించి, సావకాశమైనపు డెల్ల వారితో నత డిష్టాగోష్ఠిని కాలము జరుపుచు నామోదించు చుండెను. "బోస్టను పట్టణాచారములు, అక్కడి సమాసావృత్తులు, మాటధోరణి, కంఠ సరళత యివి యన్నియు సంతోష దాయకములై, నన్ను పునరోద్ధారణచేయునవిగా తోచెడిని" అని బెంజమిను వ్రాసెను.