పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బెంజమిను ఫ్రాంక్లిను జీవన చరిత్రము

మొదటి ప్రకరణము

బాల్యదశ

అమెరికాదేశమునందు బ్రసిద్ధికెక్కిన కార్యనిర్వాహకుడును, దేశాభిమానియు, తత్వ-------- బెంజమిను ఫ్రాంక్లినుగారి జీవితచరిత్రమును ఇందు పొందుపఱచుచున్నారము. ఇంగ్లాండు 'నా---------- నందలి 'ఎక్టమ పట్టణమందు క్రీ. శ. 1655 - వ సంవత్సరమున, అతని తండ్రి, జోషయాఫ్రాంక్లిను జనన మొందెను. తన యౌవన కాలములో నితడు బట్టలకు రంగువేయు వ్యాపారము నవలంబించి, క్రమముగా దానియందే స్థిరపడి, 'ఆక్సుఫర్డ్ షియరు' (Oxford Shire) నందలి 'బాన్ బరి' (Bunbury) పట్టణములో నివసించి యుండగా, 21 - వ సంవత్సరమున ఇతని కాగ్రామముననే వివాహ మాయెను. ఈయన తమ్ముడు బెంజమిను ఆగ్రామము నందలి పాదిరియొక్క కుమార్తెను వివాహమాడెను. బాన్ బరి పట్టణమందె సంబంధము జేసికొని, అక్కడనే వ్యాపా