పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంతమగుకాలమున నెందఱు మహాపురుషులు జననమై, భూభారమును వహించిరి? దేశచరిత్రలలో జెప్పబడినవారుకాక, మఱి యెందరు మినహాయించంబడిరో గదా' వారిప్పుడు లేరా' ముందుకుండరా' వా రన్ని కాలములలోను గలరు భూమి నిలబడియుంటయె, వారు కలరనుటకు నిదర్శనము వారు కనుపులవంటివారు; ఈ కనుపులను బట్టుకొనియే, మనము కాలారోహణము జేయుచున్నాము.


                        "నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప |
                         ఏషతూద్దేశత: ప్రాక్తో విభూతేర్విస్తరోమయా ||"
                        "యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా |
                         తత్తదేవాగచ్ఛత్వం మమ తేజోం శ సంభవం ||"