పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. శాశ్వతపు చందాదారులు సంవత్సరపు చందా మొదట నీయనక్కరలేదు. ఒక్కొక్కపుస్తక మచ్చుపడగానే అది వాల్యూపేయబిల్ ద్వారా పంపబడును. పోస్టేజి చందాదారులే భరింపవలయును.

6. వెనుకటి పుస్తకములు నన్నిటిని గొను చందాదారులు ప్రవేశరుసు మియ్యనక్కర లేదు. వెనుకటి పుస్తకముల నన్నిటిని ఒక్కసారి కొన లేనివారు రు 3-0-0 వెలగలపుస్తకములు మొట్టమొదట కొనినజాలును. మిగత పుస్తకములు తరువాత తెప్పించుకొనవచ్చును.

7. వెనుకటి పుస్తకములు అక్కరలేనివారు ప్రవేశ రుసుముక్రింద రు 1-0-0 చెల్లించవలెను.

8. చందాదారులు మాప్రచురములలోని గ్రంధములను చందాదారుల వెలకు ఒకటికన్న నెక్కువ పొందలేరు.

9. గ్రంధమాలలోని గ్రంథములన్నియు నునుపైన దళసరి కాగితములమీద ముద్రింపబడు. అనేక చక్కనిపటములతో నొప్పుచుండును. క్యాలికోబైండు చేయబడు, సరసమైన వచన శైలినికలిగియుండును. ఇట్లు సర్వాంగసుందరములై చౌక వెలకు దొరకుగ్రంధములు తెలుగుభాషలో నరుదు.

కే. వి. లక్ష్మణరావు. ఎం. ఏ.

సంపాదకుడు

ఆ. లక్ష్మీపతి, బి. ఏ., ఎం, బి., సి. ఎం.

మేనేజరు

మౌంటురోడ్డు, మద్రాసు.