పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రత్యుపకారము వారికి నేనెన్నటికిని జేయ లేను. స్వల్ప కార్యములవలన దైవము సంతసించి, నా కనంతముగ కటాక్షములను జూపెను. పరమేశ్వరుని కటాక్షములను బొందినందుకు, నాకృతజ్ఞతను జూపుటకు, ఆయనకు పిల్లలు, నాకు సోదరు లగువారి నిమిత్తము నేను పాటుపడుదును. వందనములును, మన్ననలును చేయుట చేత, మన కొండొరులకుగల బాధ్యతలు తగ్గవు, మనకు దైవమునకు గలబాధ్యత లంతకన్న తగ్గవు. నేనూహించిన సత్కార్యములవలన, నాకును స్వర్గమునకు నెంతదూరమో మీరు చూడుడు! శాశ్వతమై, యనంతమైన సుఖస్థితియె స్వర్గము. అట్టిపదవిని బొందుటకు నే ననర్హుడను. ప్రపంచములో నామకార్థ మొకసత్కార్యమును జేసి, స్వర్గమును బొందవలయు నని కోరిన వానికన్న, దాహశాంతి కొకనికి నీరునిచ్చి, తోటల నియ్య మని దైవమును కోరినవాడు నయమని తోచును. పరమేశ్వరుని కృపచేత, మన మసంపూర్ణమైన మిశ్రమసుఖముల నీ ప్రపంచములో ననుభవించుదముగాని, మన కర్హతకలిగికాదు; దైవకృపవలన కలిగిన స్వర్గ సుఖమెట్టిదిగ నుండును! దానిని పొందుటకర్హు డ నని గర్వము, నిరీక్షించుటకు బుద్ధిహీనత, కోరుటకు కోరికయు నాకు లేదు. నన్ను పుట్టించి పరిపాలించు ప్రభువును నేను శరణుజొచ్చెదను. పుత్రవాత్సల్యముతో గాపాడు ప్రభువు నన్ను దు:ఖసముద్రములో