పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొక యోడను బంపుటకు సన్నాహము జేసిరి. ఇత డాహూయము చేసినందున, స్వీడనుదేశపు వృక్షశాస్త్రజ్ఞుడు 'కాము' అనువా డమెరికాకు వచ్చెను. బెంజమిను ఆలోచనలను మన్నించువారి నందఱిని, పండితుని దర్శనమున కతడు తీసికొని వెళ్లెను. ఊపిరితిత్తులనుండి వెలువడు వాయు వపరిశుద్ధమైనదని కనిపెట్టినవాడు బెంజమిను, గృహములలో గాలి వ్యాపకము బాగుగ నుండవలయు నని దృడముగ సిద్ధాంతము జేసినవా డితడే.

ఇతని మతవిషయాభిప్రాయములు మారలేదు. మనుజులకు మతము ముఖ్యమైన దను దృఢనమ్మక మితనికి గలదు. పిచ్చిభ్రమలను ఖండించుటకు బదులు, సత్యమును బ్రకటనము జేసి, వాని నంతరింప జేసిన, మతము పరిశుభ్రముగ నుండునని, ఇతని యభిప్రాయము. క్రీస్తుమతముయొక్క సత్యాధిక్యమును విశేషముగ గుర్తెఱిగినవా రితనికంటె మరియెవరును లేరు. గృహములు, వృక్షములు, ప్రదేశములు మొదలయిన య చేతనములు పవిత్రము లయినవి యని, యేభయముకలదో, యదిమాత్ర మితనికి లేదు. "ఇతరులనిమిత్తము నేను పాటుపడినపుడు, వారిని నే ననుగ్రహించితి నని తలంచక, విధాయక మైనపనిని జేసితి నని తలంచెదను. నాయాత్రలలో నేమి, నేను స్థిరముగ నుండినపుడేమి, జనులు నన్నుదయతోజూచుచుండిరి. తగిన