పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నోటిలోబెట్టుకొని కొఱకుట కొక కాసుపంపితిని. దానిని బుచ్చుకొనుము. ముందుకు నీ కూతు రీకాసుతో బిక్కలను కొని కొఱకుటకు వీలగు"నని చెల్లెలికి బెంజమిను వ్రాసెను. ఆమె పిల్ల చనిపోయినపుడు, "మనము బ్రతికిన కొలది, మనకిట్టి విపత్తులు సంప్రాప్తమగును. దైవానుగ్రహమువలన నిట్టివి సంప్రాప్త మగునని, దైవవిధికి మనము బద్ధులమని తెలిసినను, మనవలె నిదివఱ కెంద రిట్టి కష్టము ననుభవించిరో, ముందునకెంద ఱనుభవించెదరో అను జ్ఞానము లేక, మనకష్టము భరించుటకు శక్యము కానిదని తలంచెదము. ఉపశమనపుమాట లెన్ని చెప్పినను కార్యము లేదు. రక్తస్పర్శగనుక, దు:ఖము కొంతకాలమువఱకు వ్యాపించి, క్రమముగ జల్లారును. ఇది నా స్వానుభవమువలన చెప్పినమాట. కష్టములో నీవు దైవకటాక్షములను మఱచిపో నందుకు నే నెంతయు సంతసించుచున్నాను. దైవకృపచేత, నీకు మిగిలిన పిల్లలు సజీవులుగ నుందురుగాక" అని బెంజమిను వ్రాసెను.

ఎన్ని పనులున్న నతడు శాస్త్రాభిలాషను బోగొట్టుకొనలేదు. ఏకముగ విద్యుచ్ఛక్తి విషయములోనే నీతడు పాటుపడుచుండ లేదు. ఇతని ప్రోత్సాహమున, వాయవ్యమూలగ నాశియాఖండమునకుబోవు మార్గమునుగని పెట్టుటకు, ఫిలడల్‌ఫియాలో వర్తకులందఱు సమావేశమై, యుత్తరధ్రువమున