పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సొమ్ము నిమ్మని నే నెవరినడిగిన, వారు నీ సలహా నడిగితినో లేదోయని నన్నడుగుచుందురు. నేను నీ సలహా నడుగ లేదని చెప్పిన, వారు వెనుకనుండి చందా నిచ్చెద మని చెప్పి వెళ్లుదురు" అని డాక్టరు బాండు బెంజమినుకు వ్రాసెను. క్రైస్తవదేశములలో బాగుగ జరుపబడుచుండిన వైద్యశాలలలోనిది యొకటియై యున్నది.

బెంజమిను స్వదేశమునందలి ప్రజలకు విరోధియై, పరదేశమువారిచే మెప్పుబడసిన మనుజుడని జెప్పరాదు. అతనిని దెలిసినవారతనిని లెస్సగబ్రేమించుచుండిరి. ప్రతికూలప్రవర్తన కాగ్రహపడనివారిని మర్యాదచేసి, వారితో నితడు మర్యాదగ మాటలాడుచుండెను. తల్లి, సోదరులు, మిత్రులు, చెల్లండ్రు - వీరి కితనువ్రాసిన యుత్తరములు చదువుట కింపుగ నుండును. అతని యుచ్చదశలో, నతని తల్లి, వృద్ధాప్యముచేత నస్త్రశస్త్రములణిగి, క్రమముగ జీర్ణించుచుండెను. 84 సంవత్సరములు వయస్సు కలదైనను, తల్లికుమారునికి బ్రత్యుత్తర మిచ్చుచుండెను. 1752 సంవత్సరము మే నెలలో నామె స్వప్నములేని నిదురజెందెను.

తల్లి మరణానంతరమున, నితడు తనచెల్లెలు జేనుకు వ్రాసిన యుత్తరములు దయారసపూర్ణములయి యున్నవి. తన చెల్లెలికి గూతురు పుట్టినదని విని, "నా మేనకోడలిని ముద్దిడినాను. అది