పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండ్రెండవ ప్రకరణము

మహోపకారములు - ఇతరవ్యాపారములు


జ్ఞానాభివృద్ధికి బాటుపడిన విధమున, తత్ప్రచారమునకు దగిన సదుపాయములను బెంజమిను చేసెను. న్యూయార్కు పట్టణములోగాని పెన్సిలువానియా పరగణాలోగాని, యీడువచ్చిన బాలురు చదువుకొనుటకు దగిన పాఠశాలలేక పోవుటవలన, పదమూడు సంవత్సరములు ప్రాయముగల తన కుమారుని విద్యాభ్యాసము నిలిచిపోయెను. పాఠశాల లేమిని బోగొట్టుటకై, జంటో సమాజము వారితో గూడి, బెంజమిను శ్రమపడి, 5000, కాసులు చందాను ప్రోగుచేసెను. వెంటనే, పాఠశాలస్థాపింపబడెను. గుంపులు గుంపులుగ, బాలురు పాఠశాలకు బోవుచుండిరి. ఇదియే, 1779 సంవత్సరమున, "పెన్సిలువానియా సర్వకళాశాల" యయ్యెను. నేటివఱ కీకళాశాల వృద్ధిలోనున్నది.

"డాక్టరు ధామస్సు బాండు" అను వాడూహించ, బెంజమును సహాయముచేత నొకవైద్యశాల పెట్టబడెను. "నీ సహాయములేనిది, యేపని జరుగదు. వైద్యశాలను స్థాపించుటకు