పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భయము చేత, భాగ్యవంతులు ముందుగ పరారు లగుదురు. పెండ్లాము, బిడ్డలు కలవాడు, వారిరోదనముజూచి వారిని దోడ్కొనిపోవును. ఎక్కడజూచినను రోదనమే........ కొందఱు వెచ్చగనూర్చుచు, మరికొందఱు ముఖమున దప్పిదేర, పరుగిడుచుందురు భయావవామాహవము" అని బెంజమిను వ్రాసెను. "ఐక్సులాచపల్" సంధివలన వీరు నిర్భయు లయిరి.

బెంజమిను తలిదండ్రులు నేటివఱకు సజీవులయి యుండిరి. వయోవృద్ధులు గనుక, వృద్ధాప్యముచేత వారు బాధపడుచుండిరి. వారు శ్రమపడుటకు విచారించి, బెంజమిను వారికి నుత్తరములను వ్రాయుచుండెను. 80 సంవత్సరములు జీవించి, 1744 సంవత్సరమున నితనితండ్రి, జోషయా ఫ్రాంక్లిను స్వర్గస్థు డయ్యెను.

అనేక సంవత్సరములు విద్యుచ్ఛక్తి విషయమై బెంజమిను పాటుపడెను.పదార్థ విజ్ఞాన శాస్త్రజ్ఞు డని పేరొందెను. విద్యుత్సంబంధప్రయోగముల నితడు జేయుచుండెను. ఇటు లాఱుసంవత్సరములు గడిచినవి. పిడుగులోని శక్తివిద్యుచ్ఛక్తియని కనిపెట్టిన మహనీయు డితడే.