పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాశ్వతమైనదిగాని, యెన్నిక పొందినదిగాని కాలేదు. ఎందుచేతనన, దీనినివృద్ధి చేయుటకు దగినపండితు లా కాలమున విశేషముగ లేరు.

1740 సంవత్సరము మొదలు 1748 సంవత్సరము వఱకు, 'ఐరోపా' ఖండము సమరకల్లోలావృతమై యుండెను. 'న్యూ ఇంగ్లాండు' సంస్థానములలోని ప్రజలు తమ తీరములకు సమర భయము కలుగునని యెంచి, రక్షణ దుర్గములుగట్టి, సైన్యము జతపఱచి, యుద్ధనావలను సన్నద్ధముచేసి, సంరక్షణకు యుక్తమైన నితర సన్నాహమును జేసిరి. 1744 సంవత్సరము వఱకు, వీరు భయపడుటకు గారణము కనపడలేదు. కాని, నాడు మొదలు 1748 సంవత్సరములో జరిగిన "ఐక్సులాచపల్" సంధివఱకు నూతన సీమలవారు సమరభయ కంపితగాత్రులైనను, "ఆత్మసంయమ శతృచ్ఛేదము"లకు తగిన సన్నాహమును వీరు చేయలేదు. బెంజమినుయొక్క ప్రేరణచే, గ్రామస్థులు స్వగ్రామమును రక్షించుటకు బూనుకొనిరి.

సమ రాద్యంత సంప్రాప్తదు:ఖములను బెంజమిను వివరణతో వ్రాసెను. "రణభేరినాదము వినినతోడనే, నందఱు భీతమానసులగుదురు. ఒకని కొకడు సహాయముచేయు నను నమ్మకము లేదు గాన, ప్రతిమనుజుడు పరారియగును. తమయొద్దనున్న దానికంటె హెచ్చుధనము నిమ్మని శత్రువులు పీడించుదు రను