పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయుదు ననినాతో జెప్పెనుగాని, నేను దానికి సమ్మతించలేదు. ఇతరులుకనిపెట్టిన క్రొత్త సంగతులవలన మనమెటుల లాభమును బొందు చుంటిమో, యటులనే మనము కనిపెట్టిన వానివలన నితరులుకూడ సంతసించవలెను. పరోపకారమునకు కదా, మనము కష్టపడుచుంటిమి" అని బెంజమిను వ్రాసెను.

సభవారు వాదముచేయు చున్న కాలమున, నితడు లేకరి గనుక, వారి వాదములయం దిష్టము లేనందున, గోళ్లు మీటుచు కాలయాపనముచేయుట కితనికి కష్టముగ నుండెను. అందుచేత నితని స్నేహితుడు 'లోగను' అనువాడు ఫ్రెంచిభాషలో వ్రాయబడిన 'చమత్కార చతుష్కోణము" అను పాటను నేర్పుపుస్తకము నితని చేతిలో బెట్టెను. ఈ ప్రక్క పుటలో వ్రాసినదే అట్టి "చమత్కార చతుష్కోణము".

ఈ చౌకములో నిలువుగనున్న యంకెలను కలిపిన, 260 మొత్తము వచ్చును. సగము వరుసకలిపిన, వానిలో సగము మొత్తము వచ్చును. ఆరోహణ, అవరోహణగ, ఐమూల లంకెలను కలిపిన, 260 మొత్తము వచ్చును. అత డీ చౌకమును చతురముతో గలుపుచు కాలము పుచ్చుచుండెను.