పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాన ప్రళయముగ లేచి, యారాత్రియు మరుచటి దినమంతయు గొట్టుచుండెను. సముద్రముమీద, దేశమందంతట నది వ్యాపించి, చాలనాశము జేసెను. ఈ సంగతిని నూతన సీమలలోని వార్తాపత్రికలు ముచ్చటించెను. బోస్టను పట్టణములోని వార్తాపత్రికలలో తుపాను సంగతియేకాక, గ్రహణము సంగతికూడ వ్రాయబడియున్నందుకు, బెంజమినాశ్చర్యపడెను. బోస్టనులో నితనియన్నగారికి లేఖనువ్రాయ, గ్రహణము పట్టువదిలిన గంటకు తుపా నారంభమయిన దని వానివలన విని బెంజమిను నాశ్చర్యపడెను. సకృచ్ఛముగ వీని సంగతిని దెలిసికొని, యీశాన్యమూలనుండి వచ్చి యట్లాంటికి తీరమందు వీచు తుపానులు వెనుకకు నడచును - అనగా, నైఋతిమూలనుండి ఈశాన్యములకుబోవుచు గ్రమముగ వీనికి బలము తగ్గును - అను సంగతిని బెంజమిను గనిపెట్టెను. ఈకాలములో, నితనిచే "ఫ్రాంక్లి నుస్టవు" చేయబడెను. రెండుపురుషాంతరములవారు దీనిని వాడుకొనిరి. అటుపైని దీనిని పరులు వృద్ధిచేసిరి. కఱ్ఱలు లేక పోవుటవలన, పొగ భాధచేతను, దీని నితడు కనిపెట్టుట కుద్యుక్తు డయ్యెను. దీనివలన నతడు లాభము పొందవలెనని కోర లేదు. లాభమును బొంద లేదు. "పెన్సిలువానియా గవర్నరు దీనినిజూచి, సంతోషించి, దీనిమాదిరిని మరికొన్ని తయారుచేయుటకు హక్కు నాకే యుండునటుల