పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

వివాహము


వ్యవహారమును సాగించుటకు మార్గము తిన్నగనుండుట చేత, స్వస్థ చిత్తుడై, బెంజమిను వివాహోన్ముఖు డయ్యెను. "గృహిణిగాడ్ఫ్రి" యొద్ద నితడు బసచేయుచున్నందున, నామె, బందుగులయొద్దనున్న 'కన్యకగాడ్ఫ్రి" కితను తగిన వరుడని, యోచించెను.

"ఈమె మమ్ములను సమావేశముచేయుచుండెను. ఇంటివారు నన్ను భోజనమునకు బిలుచుచుండిరి. భోజనానంతరమున, మే మిరువురము మాటలాడుట కవకాశ మిచ్చుటకు, వారు సన్న సన్నగ లేచిపోవుచువచ్చిరి. తుదకు, వారితో నా యుద్దేశమును చెప్పగోరి, గృహిణిగాడ్ఫ్రీద్వారా నామాటను బంపితిని. నా ముద్రాక్షరశాలకు నేను చేసిన ఋణములో, శేషించిన నూరుకాసులను వారిని తీర్చివేయమని, వారికి మాటను బంపితిని. వారు సొమ్ము నియ్య లేమని చెప్పినందున, వారి గృహమును, తాకట్టుపెట్టి సొమ్ము నియ్యవలసినదని నేనుగోరితిని. దీనికి వారు సమ్మతించ లేదు. కొద్దిరోజులకు, బ్రాడుఫర్డు - కీమరులవలె, నేనుకూడ నచ్చుపనిలో దిగువాఱుదు నని