పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనెదను" అని బెంజమిను చెప్పెను.అప్పుడు, "నాతండ్రిమోసపోయెను. అతని యొద్ద సొమ్ములేదు. మరి నే నతనిని తొందరచేయ లేను. ఈ పని నాకు తగినదికాదు. నేను మొదట వ్యవసాయదారుడను. పట్టణమువచ్చి ముప్పదియేండ్లు వచ్చినపైని, క్రొత్తవ్యాపారములో దిగుట నాబుద్ది తక్కువ ......... నేను తిరుగ దున్ను కొనుటకు బోయెదను. నీ స్నేహితులు నీకు సహాయముచేసిన, వారిని జూచుకొనుము. మనము మునిగిచేసిన ఋణములను తీర్చుటకు శక్తి నీ కున్నయెడల, నాతండ్రిమరుఫ నిమిత్తమిచ్చి, నూరుకాసుల నిచ్చివేయుము, నేను స్వయముగ చేసిన ఋణములను తీర్చివేయుము, నాకు ముప్పదికాసుల నిచ్చిన, నావంతును నీకు విడిచిపెట్టుదును. నీవే సర్వస్వమును బొందవచ్చును" అని కుమార మెరిడిత్తు చెప్పెను.

వెంటనే, దీనికి బెంజమిను సమ్మతించి, నూరు కాసులు చొప్పున ప్రతిస్నేహితునియొద్ద బదులుచేసి, మెరిడిత్తుల కిచ్చివేసి, స్వంతముగ వ్యాపారమును పెట్టెను. నేడు మొదలు విశేషముగ నొడుదుడుకులులేక స్థిరముగ నితని వ్యాపారము నడచుచుండెను. నానాఁటికి పరపతి కలిగెను. యుక్తాహారవిహార చేష్ఠావసిష్ఠుడై, బెంజమిను తన వ్యవహారముతో మెలగుచుండెను.