పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లాండునుండి వస్తుసామగ్రినంతయు పరపతికి తెచ్చినందున, పరపతినిచ్చినవాడు వీరుచేసిన విలంబమునకు భయపడి, న్యాయసభలో వీరి సామానులమీద తీరుమానమును బొందెను. జామీనుపైని వీరిరువురిని వదిలిరి. ఇట్టి స్థితిలో, నాప్రియస్నేహితు లిరువురు వెవ్వేరుగ నాయొద్దకువచ్చి, నేను కోరినసొమ్ము నిచ్చెదమని నాతో జెప్పిరి. మెరిడిత్తుతో వంతును బోగొట్టుకొని, స్వతంత్రముగ నన్నుండ మనిరి. వారుచేసిన మేలు నాకు మరపునకు రాదు" అని కృతజ్ఞతాపూర్వకముగ బెంజమిను వ్రాసెను.

ఈ స్నేహితులు, "విల్లియంకొల్మాను", "రాబర్టుగ్రేసు" అనువారు. వీరు "జంటో" సమాజములోనివారు. జీవితకాలమంతయు వీరు బెంజమిను కాప్తులుగనుండిరి. తండ్రి, కుమార మెరిడిత్తులవలన మేలుపొంది నందున, వారిని విడుచుటకు కష్టమనియు, పత్రముప్రకారము వారు నడుచుకొనిన పక్షమున, వంతువారితో వదులుకొనుటకు తన కిష్టములేదని స్నేహితులతో నితడు జెప్పెను. అంతలో, వంతుదారుడైన కుమార మెరిడిత్తును కలిసి, "నీవుచేసిన వ్యవహారము నీతండ్రి కిష్టములేనట్టు కనబడుచున్నది. ఇచ్చెద ననిన సొమ్ము నతడు నీ కిచ్చునేమోగాని, మనకిచ్చునటుల నాకు దోచదు. ఏమాటయు, నీవునాతో రూడిగ జెప్పిన, సర్వము నీకువదిలి, నాపనిని జూచు