పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గిలో' వ్రాయబడెను. ఇందులో కీమరును యెత్తిపొడిచి బెంజమిను వ్రాయుటయు - 'బోధిని' లో నితనిని యెత్తి పొడిచి కీమరు వ్రాయుటయు, జరిగెను.

ఋణగ్రస్తు డైనందున, కీమరు పత్రికను సాగించలేక పోయెను. తుదకు దానిని బెంజమిను కతడమ్మివేసెను. పూర్వపు పేరు తీసివేసి, 'పెన్సిలు వానియాగెజెటు' అను పేరుతో 'బోధిని'ని బెంజమిను ప్రచురించెను. ఇదివఱలో దన చిన్నతనములో, దనయన్న గారికి 'కోరాంటు' పత్రికను ప్రచురించినందుకు జరిగిన పరాభవమును జ్ఞప్తికి దెచ్చుకొని, బెంజమి నీ పత్రికను జాగరూకతతోను వివేకముతోను బ్రచురము జేసెను. సత్యమును రూడిగవ్రాయుచు, యప్రియమైన సత్యమును మృదువుగ జెప్పుచు, ఇతరుల మనస్సును నొప్పింపక, యందఱికి మేలుకలుగునట్లు, బెంజమి నీ పత్రికను నడిపించుచుండెను.

ఇప్పటికిని, వీరి ముద్రక వ్యాపారము బహుళముగ నుండ లేదు. వీరు బీదవారుగ నుండిరి. సహాయముచేయుట కొకడైనను లేడయ్యెను. ఇంచుమించుగ పనినంతయు బెంజమిను చేయుచుండెను. మెరిడిత్తు పని తెలియనివాడు, త్రాగుబోతు. ఎల్లప్పుడు, వాడు మై మఱచియుండును.

ఋణమును చేయ నేకూడదు. చేసిన వెంటనే దానిని తీరుమానము చేయవలెను. లేనియెడల, నొకానొకప్పుడు, మన